హైదరాబాద్,చౌరాస్తా:బీఆర్ఆర్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం ఉదయం తెలంగాణ భవన్లో స్వేద పత్రం విడుదల చేశారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో సృష్టించిన సంపదపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.పగలూ రాత్రి తేడా లేకుండా.. రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను..దెబ్బతీస్తే సహించమని హెచ్చరించారు.తాజాగా ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనపై స్వేదపత్రాన్ని విడుదల చేశారు. కాంగ్రెస్ శ్వేతపత్రానికి కౌంటర్‌గా బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదల చేశారు. గత పాలకులు ఉద్దేశపూర్వకంగా జీవన విధ్వంసం చేశారని అన్నారు కేటీఆర్. గత కాంగ్రెస్ పాలనలో చెరువులు నిర్వీర్యం అయ్యాయని, గతంలో ఏటా పాలమూరు నుంచి 14 లోల మంది వలసపోయేవారన్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్లిన ఘనత మాదన్నారు. 60 ఏళ్ల గోస 10 ఏళ్లలో మాయం చేసి చూపించారని ఆరోపించారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే ఈ స్వేద పత్రం విడుదల చేస్తున్నామన్నారు.