KTR Road show : ‘పటేల్’ను ఎత్తిపడేసిన కేటీఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం రోజురోజుకూ వేడెక్కుతుంది. నేతలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తూ ప్రత్యర్థులపై విమర్శల బాణాలు విసురుతున్నారు. వాడీవేడిగా సాగుతున్న ప్రచారాల్లో కొన్ని సందర్భాల్లో నేతల మాటలు తడబడడం, పక్కవారి పట్ల చులకనగా మాట్లాడి ఆ వెంటనే సరి చేసుకుంటున్నారు. ఒక్క క్షణంలో జరిగిన ఆ ఘటనలు తర్వాత సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అలా వైరల్ అయిన వీడియోతో ఓ అభ్యర్థికి మస్తు ప్రచారం లభిస్తోంది.
ఆయన ఎవరంటే..
ఆయన పేరు రాజ్‌కుమార్ పటేల్.. యూసుఫ్‌గూడ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిగా గ్రేటర్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయన ఇటీవల డివిజన్లో నిర్వహించిన రోడ్ షోకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా వచ్చారు. భారీ జన సమీకరణలో జరిగిన ఈ మీటింగ్‌లో కేటీఆర్ ఎంతో ఉత్సాహంగా ప్రసంగించారు. కానీ, అభ్యర్థిని పరిచయం చేస్తూ కేటీఆర్ మాట్లాడిన తీరులో దొరతనం కనిపించింది. ఆ క్లిపింగ్ ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రసంగం సాగిందిలా..
‘మీ అందరి ఆశీర్వదంతో కాబోయే యూసుఫ్‌గూడ కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్ గారు.. సోదరులు.. ముందుకురా..’ అంటూ కేటీఆర్ (KTR Road show) అతడిని పిలిచారు. ముసిముసి నవ్వులు నవ్వుతూ రాజ్‌కుమార్ ముందుకొచ్చాడు.. ఆయనను చూస్తూ కేటీఆర్ ‘దండం పెట్టుకో..’ అన్నారు. ఆయన అంతే వినయంగా ప్రజలకు దండం పెట్టాడు. ‘బాగానే ఉన్నడుగా..’ అని కేటీఆర్ అక్కడున్న జనానికి చెప్పిన ఆ వెంటనే ‘రైట్ వెనక్కుపో..’ అని రాజ్‌కుమార్‌ను అనడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏదిఏమైనా ఇప్పుడు యూసుఫ్‌గూడ టీఆర్ఎస్ క్యాండిడేట్ రాజ్‌కుమార్ పటేల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలిసిపోయారు. ఆయన పేరు కూడా తెగ ట్రోల్ అవుతోంది.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)