
వరంగల్, మన చౌరాస్తా : కాకతీయ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్ గా పదవి భాద్యతలు చేపట్టిన ఆచార్య రాంచంద్రంను కేయూ పార్ట్ టైం అధ్యాపకుల సంఘం నాయకులు శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్ట్ టైం అధ్యాపకుల సంఘం అధ్యక్షులు సోల్తి కిరణ్ గౌడ్, జనరల్ సెక్రటరీ డా.నాగేశ్వర్ రావు, సుమంత్, మోహన్ శ్రీకాంత్ యాదవ్, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, శ్యాసుందర చారి, రవీందర్, రజినీకాంత్, డాక్టర్ జి.మాణిక్యరావు, డాక్టర్ పి.శ్రీనివాస్, డాక్టర్ వై .ప్రభాకర్, సోమలింగం లక్ష్మణ్, సీనియర్ పార్ట్ టైం అధ్యాపకులు పాల్గొన్నారు.