
- జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారజోడు రాంబాబు
- ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు
జనగామ, మన చౌరాస్తా : ప్రతీ ఒక్కరు పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని జిల్లా జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారజోడు రాంబాబు సూచించారు. జిల్లా గ్రంథాలయ 58వ వారోత్సవాల సందర్భంగా ఈనెల 14 నుంచి 20 వరకు గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గురువారం ముగింపు సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముగింపు వారోత్సవాలకు ముఖ్య అతిథులుగా జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్, జనగామ మార్కెట్ కమిటీ చైర్మ న్ బనుక శివరాజ్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ చందర్ రెడ్డి, రఘునాథపల్లి మాజీ జడ్పీటీసీ బొల్లం అజయ్ పాల్గొని మాట్లాడారు.

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, ప్రతి ఒక్కరు పుస్తక పఠనం చేయాలని సూచించారు. ప్రస్తుత నెట్ ప్రపంచంలో సెల్ ఫోన్ గూగుల్ ద్వారా సమాచారాన్ని వెతకడం కాకుండా నేరుగా రచయితలు, కవులు, కళాకారులు గతంలో ప్రచురించిన పుస్తకాలను గ్రంథాలయాల్లో పొందపరచిన వాటిని చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకున్నప్పుడే సమాజానికి దిక్సూచిగా నిలబడతారని అన్నారు.





