vijay devrakonda Promise : మాట నిలబెట్టుకున్న ‘లైగర్’
ప్రస్తుతం యూత్‌లో హీరో విజయ్ దేవరకొండకు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. అతడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ‘ఇండియన్ ఐడల్-12’ ఫైనల్స్ చేరిన తర్వాత యువ గాయని, తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియను లైగర్ హీరో విజయ్ దేవరకొండ సపోర్ట్ చేశాడు. ఈ మేరకు ఆమెకు విజయ్ ఓ ప్రామిస్ చేశాడు. ఇండియన్ ఐడల్ ఫైనల్స్‌లో గెలిచినా, గెలవకపోయినా తన సినిమాలో అవకాశం ఇస్తున్నట్లు అతడు ప్రకటించాడు. దీంతో స్వతహాగా విజయ్ దేవరకొండకు పెద్ద అభిమాని అయిన ఇండియన్ ఐడల్ ఫేం షణ్ముఖ ప్రియకు విజయ్ తన సినిమాలో అవకాశం ఇస్తానని మాట ఇవ్వడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిజంగా విజయ్ ఆ పని చేస్తాడా లేదా అని చాలామంది ఎదురుచూశారు. (LigerPromise Shanmukha Priya)
అయితే విజయ్ దేవరకొండ తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఇచ్చిన మాట ప్రకారమే విజయ్ ఇప్పుడు తన చిత్రంలో షణ్ముఖ ప్రియ చేత పాట పాడించాడు. షణ్ముఖ ప్రియను తన ఇంటికి పిలిపించుకుని ఆమెకు హగ్ ఇచ్చి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. పూరీ జగన్నాథ్‌తో మాట్లాడి తనకు సూట్ అయ్యే సాంగ్ కోసం చర్చించినట్లు తెలిపాడు. అలాగే షణ్ముఖ ప్రియ పాడిన పాటను రికార్డింగ్ చేసిన తర్వాత ఆమెను ఇంటికి పిలిపించుకుని విజయ్ చాలాసేపు మాట్లాడాడు. ఈ యువ గాయనిని సత్కరించిన విజయ్ దేవరకొండ తల్లి ఆమెకు చీరను బహుకరించింది. ‘సాంగ్ రికార్డింగ్ బాగా జరిగిందా, నేను వచ్చే వారం వింటాను’ అని షణ్ముఖ ప్రియతో విజయ్ తెలిపాడు. కాగా మార్షల్ ఆర్ట్స్ నేపథ్య కథతో తెరకెక్కుతున్న ‘లైగర్’ మూవీ ఈపాటికే విడుదల కావాల్సింది. కానీ కరోనా వల్ల షూటింగ్ ఆలస్యమైంది. దీంతో రిలీజ్ కూడా లేట్ అయింది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే నటిస్తోంది. కరణ్‌జోహార్, ఛార్మీ, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మరిన్ని కథనాల కోసం.. : మొదటి రోజే టాస్క్‌ల రచ్చ
గర్భవతిని వదిలేసి వచ్చిన నటరాజ్