
- అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్
- ఘనంగా లయన్స్ క్లబ్ జనగామ స్వర్ణోత్సవ వేడుకలు
- నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
జనగామ, మన చౌరాస్తా : సామాజిక రుగ్మతల నివారణకు అవగాహన అనివార్యం అని జనగామ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. ఆదివారం రాత్రి ఎస్ ఎస్ ఎన్ ఫంక్షన్ హాల్లో జరిగిన లయన్స్ క్లబ్ జనగామ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. క్లబ్బు అధ్యక్షుడు లయన్ వై సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు లయన్స్ క్లబ్బులు ఆరోగ్య విషయంలో విద్యారంగ విషయంలో చేసిన సేవలు అభినందనీయమని అన్నారు.
ఆ కార్యక్రమాలు ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఎక్కువ స్థాయిలో చేస్తున్నదని అంటూ లైన్స్ క్లబ్బులు ప్రస్తుతం సమాజానికి ఇబ్బందిగా ఉన్న సామాజిక రుగ్మతల అవగాహన పట్ల ప్రజలను చైతన్యవంతులు చేయాలని సూచించారు గ్లోబల్ వార్మింగ్ పర్యావరణ పరిరక్షణ ప్రత్యేకంచి ప్లాస్టిక్ నిషేధం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం అనివార్యం కనుక లయన్స్ క్లబ్ లు రానున్న రోజులలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తూ అధికారులుగా తమ వంతు సహకారము ప్రోత్సాహం తప్పనిసరిగా లయన్స్ క్లబ్ లకు ఉంటుందని తెలియజేశారు జనగామ పట్టణంలో సుందరీకరణ కార్యక్రమం కింద బతుకమ్మ కుంట ప్రాంతంలో అందరికీ ఉపయుక్తంగా ఉండే పార్కు ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తాను పాఠశాల విద్యార్థిగా ఉన్న సమయంలో అహ్మదాబాద్ లో లయన్స్ క్లబ్ కార్యక్రమాల గురించి తెలుసుకున్నా కానీ పాల్గొనలేకపోయానని ప్రస్తుతం ఒక అధికారిగా పాల్గొనడం సంతోషదాయకం అని అన్నారు.
50 సంవత్సరాలుగా జనగామ ప్రాంతంలో సేవలందించిన లయన్స్ క్లబ్ సభ్యులు ప్రత్యేకించి వ్యవస్థాపక సభ్యులకు అభినందనలు తెలిపారు. ముఖ్య అతిథి అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ ను క్లబ్ పూర్వ అధ్యక్షుడు రీజియన్ చైర్మన్ (డి) చంద్రగిరి శ్రీనివాస్ సభకు పరిచయం చేసారు. ఈ సందర్భంగా స్థానిక అగ్రగామి పత్రిక ప్రచురించిన ప్రత్యేక సంచికను గౌ. అతిథులు ఆవిష్కరించారు. అలాగే క్లబ్ వ్యవస్థాపక సభ్యులు, పూర్వ అధ్యక్షులు, ఎల్ సి ఐ ఎఫ్ కు నిధులు విరాళంగా ఇచ్చిన మెల్విన్ జోన్స్ ఫెలో సభ్యులను సన్మానించారు. అలాగే ఈ వేడుకలో పాల్గొన్న అతిథులను ఘనంగా సన్మానించారు. తొలుత ప్రోగ్రాం కమిటి చైర్మన్ పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కె. గోవింద్ రాజ్ క్లబ్ చరిత్రను సింహావలోకనం చేస్తూ క్లబ్ చరిత్రను సంక్షిప్తంగా వివరించారు.
సేవల తో పాటు నాయకత్వ పురోభివృద్ధికి, క్లబ్ ల విస్తరణ కు కృషి చేసి ప్రస్తుతం జిల్లాలో ఉన్న క్లబ్ లలో అత్యధిక శాతం జనగామ వంశ వృక్షం నుండి వచ్చినవేనన్నారు. క్లబ్ అధ్యక్షుడు సంజీవరెడ్డి అతిథులకు పేరు పేరున సంబోధిస్తూ స్వాగతం చెప్పారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న లయన్స్ ఇంటర్నేషనల్ గ్యాట్ ఏరియా లీడర్ లయన్ దీపక్ భట్టాచార్జీ మాట్లాడుతూ క్లబ్ వ్యస్థాపక కార్యదర్శి ఇటీవల దివంగతులైన కాసం అంజయ్య సేవలను గుర్తుచేస్తూ భవిష్యత్ జనగామ క్లబ్ ఆదర్శ క్లబ్ గా వెలుగొందగలదని అభిలషించారు.
ఈ సందర్భంగా సభ్యులకు ఆయన ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు పక్షాన సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. జిల్లా గవర్నర్ లయన్ కుందూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో లయన్స్ క్లబ్ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవడం, గవర్నర్ గా తాను ఉండడం ఆనందదాయకం అన్నారు. క్లబ్ 51 వ అధ్యక్షుడు గా అడ్వకేట్ బి. దయాకర్ రెడ్డి, కార్యదర్శిగా సిహెచ్ బాబురావు, కోశాధికారిగా కాశం సుకుమార్ వారి టీం కార్యవర్గ సభ్యులచేత ఫస్ట్ వైస్ జిల్లా గవర్నర్ లయన్ ఎం. సుధాకర్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా త్యాగానికి ప్రతీక అయిన రక్త దాన శిబిరం నిర్వహించి రక్తదానం చేశారు. జనగామ క్లబ్ సభ్యులను అభినందిస్తూ మల్టిపుల్ కార్యదర్శి ఎన్. వెంకటేశ్వర రావు, మల్టిపుల్ విస్తరణ చైర్మన్ లయన్ ఎస్. ఎం. రెడ్డి, పూర్వ జిల్లా గవర్నర్లు డా. కే. రాజేందర్ రెడ్డి, డా. డి .లవకుమార్ రెడ్డి, పొట్లపల్లి శ్రీనివాస్ రావు, టి. లక్ష్మీ నరసింహ రావు, ముచ్చ రాజిరెడ్డి, కన్న పరశురాములు శుభాశీసులందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలిపిన వారిలో జిల్లా క్యాబినెట్ కార్యదర్శి సయ్యద్ హబీబ్, క్యాబినెట్ కోశాధికారి (డి) చల్లా రఘునాథ్ రెడ్డి, గ్యాట్ జిల్లా లీడర్స్ డా. వి. శారద, ఆర్. రమణారెడ్డి, టి. వెంకటీ రెడ్డి, డా . జి. ప్రమోద్ కుమార్ గుప్త, క్రిష్ణ జీవన్ బజాజ్, కె . సుభాష్, జిల్లా చీఫ్ సెక్రటరీ సర్వీసెస్ మార్గం ప్రభాకర్, రేగూరి వెంకన్న, కె. రాంగోపాల్ రెడ్డి రీజియన్ చైర్మన్ లు చందుపట్ల రెడ్డి, జోన్ చైర్మన్ లు శ్రీభాష్యం రఘు, కె. ఉపేందర్, ఫజ్జూరి జయహరీ , గోపయ్య, కె. ఉప్పలయ్య, అల్లాడి ఈశ్వర్ రావు, టి. వెంకట నారాయణ, మరలా బిక్షపతి, చందా హన్మంతరావు, డా. కల్నల్ మాచర్ల భిక్షపతి, టి. కృష్ణా రెడ్డి, బుస్సా సిద్దేశ్వర, జి చంద్రశేఖర్ రావు, జి. రామచంద్రం, మర్యాల అశోక్ తదితరులు పాల్గొన్నారు.