జనగామ, మన చౌరాస్తా : లయన్స్ క్లబ్ ఆఫ్ జనగామ మిలీనియం ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుడు గాదె నర్సింహులు జన్మదిన ము సందర్బంగా స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో 75 మంది అవసరార్థులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో జోన్ చైర్మన్ రంగరాజు ప్రవీణకుమార్ మాట్లాడుతూ అన్ని దానలలో కంటే అన్నదానం చాలా గొప్పదని, ఆకలితో ఉన్న నిరుపేదలకు ఆహారం అందించడం చాల తృప్తి ఇస్తుందని అన్నారు. క్లబ్ కార్యదర్శి వెర్రి వేణుగోపాల్ రెడ్డి, కోశాధికారి బండ భిక్షపతి, పీఆర్సీ ఏనుగు నర్సిరెడ్డి, సభ్యులు దాసరి సుమన్, సూరారం రాజు పాల్గొన్నారు.