
బచ్చన్నపేట,మన చౌరాస్తా : స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని కోడువటూర్ క్లస్టర్ ఇంచార్జ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మసూద్, దయాకర్ అన్నారు. జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం బచ్చన్నపేట మండలంలోని కొడవటూర్, కేసిరెడ్డిపల్లి గ్రామాల్లో మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల సన్నహాక సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మసూద్, దయాకర్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త మన పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ లను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని కోరారు. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.