marriage invitation : పెళ్లిసందడికి అంతా రెడీ
కోవిడ్ రూల్స్ సడలింపుతో రాష్ట్రంలో పెళ్లి సందడి మొదలైంది. ఈ కార్తీక మాసం మంచి ముహూర్తాలు ఉండడంతో గతంలో లాక్ డౌన్ కారణంగా ఆగిన వివాహాలతో పాటు కొత్తగా నిశ్చయించుకున్న వారి పెళ్లిళ్లు చేసేందుకు అంతా రెడీ అవుతున్నారు. దీంతో నిన్నమొన్నటి వరకు వెలవెలబోయిన బంగారు, బట్టల దుకాణాలు, ఫంక్షన్ హాల్స్ మళ్లీ కళకళలాడుతున్నాయి.
డిసెంబర్ 11 వరకే ముహుర్తాలు
ఈ కార్తీక మాసంలో పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు మొదలయ్యాయి. వచ్చే నెల (డిసెంబర్ ) 14వ తేదీ వరకు కార్తీక మాసం ఉన్నా.. 11వ తేదీ వరకు మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి. డిసెంబర్ 2, 4, 6, 9, 10, 11వ తేదీల్లో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో వివాహాలు జరుగనున్నాయి. ఆ తర్వాత 2021 కొత్త సంవత్సరంలో 6వ తేదీ వరకు మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు పేర్కొన్నారు. జనవరి 13 నుంచి పుష్యమాసంలో గురు మూఢం మొదలవుతుందని చెబుతున్నారు. దీంతో దాదాపు ఆరునెలల పాటు మంచి ముహూర్తాలు ఉండవన్నారు. ఫిబ్రవరిలో వచ్చే మాఘమాసం, ఏప్రిల్‌లో వచ్చే ఉగాది (ఫ్లవ నామ సంవత్సరం)లో కూడా గురు మూఢం కొనసాగుతుందన్నారు. దీంతో డిసెంబర్లోనే తమ పిల్లల పెళ్లిళ్లు చేసేందుకు పెద్దలు మక్కువ చూపుతున్నారు.
అంతా బిజీబిజీ..
లాక్ డౌన్ కారణంగా దాదాపు ఆరు నెలలుగా మార్కెట్ అంతా బంద్ అయ్యింది. చాలా మంది పనులు లేక ఇబ్బంది పడ్డారు. లాక్ డౌన్ రూల్స్ సడలింపుతో ఆర్నెళ్లుగా పనులు లేక ఇబ్బంది పడిన వారంతా మళ్లీ ఎప్పటిలాగే బిజీబిజీగా మారిపోతున్నారు. ఇక పెళ్లిళ్ల సీజన్ ప్రారంభంతో పంతుళ్లు, ఫొటో గ్రాఫర్లు, డికరేషన్ డీజేనర్లు, వంటమనుషులు మరింత బిజీ అయ్యారు. ఫంక్షన్ హాళ్లు, ట్రావెల్స్‌ను అడ్వాన్స్‌లు ఇచ్చి బుక్ చేసుకుంటున్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)