MLA : ఎమ్మెల్యేలకు నేరచరిత్ర
రాజకీయం నేరగాళ్లకు అడ్డాగా మారిపోయింది. నేరచరిత్ర కలిగిన ఎంతో మంది ఇప్పుడు చట్టసభల్లో లీడర్లుగా కొనసాగుతున్నారు. కొన్ని రోజులుగా వీరి ఎంట్రీ మరీ ఎక్కువవడంతో ఆందోళన కలిస్తోంది. త్వరలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగనున్న తమిళనాడుతో 33 శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు (mla) నేరచరిత్ర ఉందని ఏడీఆర్ ప్రకటింటింది.
తమిళనాడుతో ఇప్పుడు ఉన్న 68 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 33 శాతం మందికి క్రైం హిస్టరీ ఉందని పోల్రైట్స్ గ్రూప్ ఏడీఆర్ నివేదికలో తెలిపింది. వీరందరిపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని స్పష్టం చేసింది. అనుకున్న విధంగా విచారణ జరిగితే నేరచరిత్ర ఉన్న 33 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 19 శాతం మందికి నాన్ బెయిలబుల్, ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇందులో డీఎంకేకు చెందిన వారు 40 మంది, అధికార అన్నాడీఎంకేలో 23 మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు నలుగురు ఉన్నారు.
ఇందులో డీఎంకేలో 22 మంది, అన్నా డీఎంకేలో 13 మంది, కాంగ్రెస్లో ఇద్దరు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది. వీరిలో ఎనిమిది మందిపై హత్యాయత్నం, ఇద్దరిపై మహిళలపై దాడుల కేసులు ఉన్నట్లు వివరించింది.
రాజకీయాలు వదిలి వ్యవసాయం చేస్తున్నలీడర్