పాలకుర్తి, మన చౌరాస్తా : జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని వాల్మీడి దేవస్థానం , పాలకుర్తి సోమేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా గురువారం ఆయా ఆలయ ప్రాంగణాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి టూరిజం నిర్మాణాలు , పెండింగ్ పనుల పురోగతిని వారు సమీక్షించారు. ప్రధాన నిర్మాణ పనులు, సౌకర్యాల కల్పన, భక్తులకు అందించవలసిన సేవలపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే పర్యాటక అభివృద్ధిలో నిలిచిపోయిన పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కోరారు. చారిత్రక ఆలయాల అభివృద్ధి కోసం ఇప్పటికే కేటాయించిన నిధుల వినియోగం , ఇంకా చేపట్టాల్సిన పనుల వివరాలను వారు సమీక్షించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని, ఆలయ ప్రాంగణాల్లో తాగునీరు, పారిశుధ్యం, లైటింగ్ వంటి సౌకర్యాల మెరుగుదలపై చర్చించారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభవాన్ని మరింత మెరుగుపరచడం కోసం సదుపాయాలు కల్పించాలని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ , ఆర్ డి ఓ ఎంకన్న , తాసిల్దార్ శ్రీనివాస్, ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ నాయకులు, ఆలయ సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.