జనగామ, మన చౌరాస్తా : జనగామ పట్టణ కేంద్రంలోని బతుకమ్మ కుంటలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి శుక్రవారం మార్నింగ్ వాక్ చేశారు. వాకింగ్ చేస్తూ ప్రజలతో మమేకమై వారి యోగక్షేమాలు, సమస్యలను తెలుసుకొని ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. త్వరలో జరుగబోయే బతుకమ్మ, దసరా పండుగ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ ముస్త్యాల దయాకర్, సీనియర్ నాయకులు ఉడుగుల నర్సింహులు, తిప్పారపు విజయ్, ఉల్లెంగుల సందీప్ తదితరులు ఉన్నారు.
మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి..