
జనగామ, మన చౌరాస్తా : జనగామ నియోజకవర్గంలోని కొమురవెల్లి మండలం లెనిన్ నగర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త దాసరి ప్రభాకర్ ఆరు నెలల క్రితం రోడ్డు యాక్సిడెంట్ మృతి చెందారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్నందున పార్టీ తరపు నుంచి రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా మృతుడి భార్య దాసరి శిరీషకు సోమవారం అందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తలారి కిషన్, రాకం భాస్కర్ పాల్గొన్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)