
పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేసిన నేతలు
జనగామ, మన చౌరాస్తా : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. గురువారం జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో రఘునాథపల్లి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వారాల రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బక్క నాగరాజు యాదవ్, కొమురవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ సెవెల్లి సంపత్ ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ప్రమాదానికి గురైన చికిత్స విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మెల్యే పల్లా త్వరగా కోలుకుని ప్రజా జీవితంలోకి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్లు చైర్మన్ సిద్ధిలింగం, మాజీ మార్కెట్ చైర్మన్ బండ పద్మ యాదగిరి, లింగాలఘనపూర్ మండల అధ్యక్షుడు బస్వాగని శ్రీనివాస్, జిల్లా నాయకులు లింగాల సింధు, బీఆర్ ఎస్వీ రాష్టం కార్యదర్శి కొమ్ము రాజు, జిల్లా ఎన్నికల అధికార ప్రతినిధి రావెల రవి, జనగామ మండల అధ్యక్షుడు భైరగోని యాదగిరి, మాజీ కౌన్సిలర్ దయాకర్, జిల్లా మహిళా నాయకులు మడ్లపల్లి సునీత, విజయ, మాజీ ఎంపీటీసీ నాగరాజు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ శివరాత్రి రాజు, బీఆర్ఎస్ నాయకులు బొల్లా సంపత్ యాదవ్, మాజీ సర్పంచ్ సేలంద్ర కొమురయ్య యాదవ్, జిల్లా యువజన నాయకులు చెండి భరత్, రఘునాథపల్లి సోషల్ మీడియా ఇంచార్జి జోగు శ్రీకాంత్, కావటి రవి, అంజయ్య, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.