
జనగామ, మన చౌరాస్తా : జనగామ మండలం చీటకోడూరు శ్రీ పంచకోసు రామ లింగేశ్వర స్వామికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పత్యేక పూజలు చేశారు. మహా శివరాత్రి సందర్భంగా బుధవారం ఆయన స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేశారు. అనంతరం వేద పండితులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ కోరిన కోర్కెలు తీర్చే రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆలయంలో సదుపాయాలు మెరుగు పర్చుకోవాల్సి అవసరం ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ మేకల కలింగరాజు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఇర్రి రమణారెడ్డి, ఉడుగుల నర్సింహులు, ముస్త్యాల దయాకర్, శ్రీశైలం, ఉల్లెంగుల సందీప్ తదితరులు ఉన్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)