- వంద రోజుల్లో రుణ మాఫీ అన్నరు..
- రూ.500 బోనస్ ఏమైంది
- పట్టభద్రులు ఆలోచించి ఓటేయాలి
- జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ, మన చౌరాస్తా : అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రైతు రుణ మాఫీ చేస్తామని, పండిన పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ హౌజ్ వద్ద మీడియాతో మాట్లాడారు.
2014 లో జనగామ జిల్లాలో తెలంగాణ రాక ముందు వరి పంట కంటే, కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక మూడు రెట్లు పెరిగిందన్నారు. తెలంగాణలో గతంలో ఒక పంట పండేది, కానీ తెలంగాణ వచ్చాక రెండు పంటలు పండేలా కేసీఆర్ చేసిన కృషి ఎంతో ఉందని కొనియాడారు. నిన్న క్యాబినెట్ మీటింగ్‌లో రైతులకు నిరాశే ఎదురైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే డిసెంబర్ 09న రూ.2 లక్షల రుణమాఫీ అవుతుందని రైతులు సంతోష పడ్డారని, కానీ అది అమలు కాలేదన్నారు. ఆ తర్వాత 100 రోజుల్లో చేస్తామని మోసం చేశారన్నారు. ఇప్పుడు మళ్లీ ఆగస్టు అని హామీలిస్తున్నారన్నారు.
రైతు బంధు ఎకరానికి రూ.15 వేలు అని చెప్పి.. ఈ ఏడాది ఎంత మందికి ఇచ్చారని పల్లా ప్రశ్నించారు. రైతు బంధును త్వరలోనే 3, 4 ఎకరాలకు పరిమితం చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నదని ఆరోపించారు. రైతులను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు రైతుల పిల్లలైన పట్టభద్రులు ఆలోచించి ఓటేయాలన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తమ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి బిట్స్ పిలనిలో చదువుకున్న స్వచ్ఛమైన వాడన్నారు. తీన్మార్ మల్లన్నపై 56 కేసులు ఉండి,72 రోజులు జైల్లో ఉన్న నిందితుడని, తీన్మార్ మల్లన్న మరో నాయిమ్ అని విమర్శించారు. తాను ప్రజల ఆవసార్థం జనగామకు వచ్చానని, నా వల్లనే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చిందన్నారు. తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అనేక మంది ఉద్యగులను రెగ్యులరైజ్ చేయించానని, ప్రమోషన్లు ఇప్పించానని పేర్కొన్నారు. తెలంగాణ గ్రాడ్యుయేట్లు ఆలోచించి బీఆర్ఎస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, మార్కెట్ మాజీ చైర్మన్ బాల్దె సిద్దిలింగం, రైతు బంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గద్దల నర్సింగరావు, గాడిపెళ్లి ప్రేమలత రెడ్డి, బైరగొని యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)
ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్
ఉద్యోగం మానేకే అప్పు ముట్ట జెప్పిన