Mp Arvind: నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ హౌస్ అరెస్టు వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది. బీజేపీ ప్రగతి భవన్ ముట్టడి పిలుపుతో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతల ఎక్కడికక్కడ అరెస్టులు చేసి కట్టడి చేశారు. ఈ క్రమంలో బంజారా హిల్స్ లోని ఎంపీ అర్వింద్ ఇంటికీ పోలీసులు వచ్చారు. హౌస్ అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులను ఎంపీ (Mp Arvind ) ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేశారు. ‘ఇంత పొద్దున ఎందుకొచ్చారు..? ఏం తమాషా.. నా ఇంటి ముందు సీన్ ఏందీ..? అసలు ఎందుకు వచ్చారు..? ఆ ప్రగతి భవన్లో మీ సారు ఉన్నడా…?’ అంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మరిన్ని కథనాల కోసం ‘చౌరస్తా’ను క్లిక్ చేయండి
https://www.facebook.com/franklyarvind/videos/363526984753284/