muchata : చౌరాస్తాలో ‘ముచ్చట’
తెలుగు రాష్ట్రాల్లో ‘ముచ్చట’ సారు తెలియని జర్నలిస్టులు ఉండరు.. ఎక్కడ ఇద్దరుల విలేకరులు కలిసినా సరే ఆయన ‘ముచ్చటే’.. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లోని డెస్క్ల్లోనూ సారు ‘ముచ్చట’లేని రోజూ ఉండదు.. అందుకే ఈ రోజు మన ‘చౌరాస్తా’లో ఆ సారు ‘ముచ్చట’ పెడుతున్నా..
వ్యవస్థగా మారాలనుకునే వారికి గొప్ప స్ఫూర్తి ‘ముచ్చట’.. అంటూ MSR (మంచాల శ్రీనివాసరావు) గారిపై ఓ మిత్రుడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.. ఆ మాటలు కొన్ని..
- ‘అవకాశం వస్తే అద్భుతాలు చేస్తాం.. అని చాలామంది అనుకుంటున్నారు. అవకాశాలు అన్ని వేళలా అందరికీ రావు. మనమే సృష్టించుకోవాలి. వ్యక్తిగా కంటే వ్యవస్థగా ఎదగాలనే ఆలోచన ఈ మధ్య బాగా పెరిగింది. ముఖ్యంగా మీడియాలో ఉన్న వారు తమకు తాముగా సొంతంగా ఎదగాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వారికి చక్కనైన రోల్ మోడల్‌గా నిలుస్తోంది..‘ముచ్చట’..’ అంటూ Srinivasa Rao Manchala గారిపై హర్షాతిరేకలు కురిపించారు.
ఆ మిత్రుడు చెప్పినట్లుగానే మీడియా రంగంలో MSRగారి ‘ముచ్చట’ ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. అలా వచ్చిందే నా ‘చౌరాస్తా’ కూడా..
‘ముచ్చట’ వ్యవస్థాపకులు Manchala Srinivasa Rao గారు.. అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లి వాసులు.. 1988లో ఈనాడు నుంచి ఓ మామూలు మండల విలేకరిగా ప్రస్థానం మొదలు పెట్టారు. ఆ రోజుల్లోనే సంచనల వార్తలకు MSRగారు పెట్టింది పేరు. అప్పట్లో వార్తలు రాసి కవర్ ద్వారా ఈనాడు కరీంనగర్ ఆఫీస్‌కు పంపేవారు. అలా సరైన రవాణా సదుపాయలు లేని సమయంలోనే ఎంతో నిబద్ధతో పనిచేసి ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ వంటి ప్రధాన పత్రికల్లో సబ్ ఎడిటర్, స్టాఫర్, నెట్వర్క్ ఇంచార్జి హోదాల్లో పనిచేశారు. ఆయా యాజమాన్యాల వైఖరి వలనో, ఆయన వ్యక్తిగత కారణాలతో తెలియదుగాని సార్.. నౌకరి వదిలి ‘ముచ్చట’ పేరు వెబ్ మీడియా వైపు ‘కొత్త దారి’ పట్టారు. దాదాపు మూడు దశాబ్దాల కింది జర్నలిస్టు అయినా సార్ ఎప్పటికప్పడు అప్ డేట్ అవుతూ.. నేటి తరం జర్నలిస్టులతో సమానం, వేగంగా పని చేయడం నిజంగా వండర్‌గా అనిస్తుంది. ఆయన కమిట్మెంట్కు సలాం కొట్టాలనిపిస్తుంది.
కంటెంటే ఆయన బలం..
MSRగారి muchata.comలో ఎలాంటి తంబ్నెల్స్, హంగులు, ఆర్భాటలు, యాడ్స్ అలసలే ఉండవు. సాదాసీదాగా ఉండే ఆయన ‘ముచ్చట’కు కంటెంటే ఓ బలం.. వ్యంగ్యంగా, విమర్శనాత్మకంగా ఉండే ఆయన కథనాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆయన ‘ముచ్చట’ కోసం మీడియా రంగంలో పని చేస్తున్న ఎన్నో వేల కళ్లు నిత్యం ఎదురు చూస్తుంటాయనడంలో అతిశయోక్తి లేదు. పాత కంప్యూటర్‌తో ఒక్కరిగానే తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఇప్పుడు ఓ పెద్ద వ్యవస్థే.. వేళ్లుకున్న ఈ వెబ్ జర్నలిజంలో ‘మంచాల’గారి పయణం నల్లేరు మీద నడకలాగే సాగుతోంది. ఇందుకు ఆయన పడిన శ్రమ అంతాఇంతా కాదు. ఎంతో కమిట్మెంట్తో కంప్యూటర్‌పై కూర్చుని కథనాలు అందించడం అంత ఆషామాషీ కాదు. మీడియా సర్కిళ్లలో నిత్యం ప్రధాన దినపత్రికలతో పాటుగా తప్పకుండా చదివే న్యూస్ ప్లాట్ ఫామ్స్‌లోకి ‘ముచ్చట’ చేర్చడం మామూలు విషయం కాదు.. ఒకటి అని చెప్పగలను. ఎన్ని వెబ్ సైట్ వచ్చినా ‘ముచ్చట’ను బీట్ చేయలేవు.
సార్‌తో పరిచయం..
2010లో నేను సాక్షి జర్నలిజం స్కూల్లో సబ్ ఎడిటర్ ట్రేనింగ్ తీసుకున్నా. అప్పుడు మా బ్యాచ్ మంచాల శ్రీనివాసరావు సార్ క్లాస్‌లు చెప్పారు. ఆ సమయంలోనే సార్‌కు కలిశాను. ఆ తర్వాత ఎప్పుడు కలవలేదు. సార్ ఎలా ఉన్నారో చూద్దామన్నా.. ఫేస్ బుక్‌లో కూడా కొత్త ఫొటో అప్‌లో చేయరు.. కానీ సార్ ‘ముచ్చట’ మాత్రం ఆగదు.. గతంలో రోజుకు ఒకటి రెండు మాత్రమే కథనాలు ఇచ్చేవారు.. ఇప్పడు మరింత స్పీడ్ పెంచారు. ఎప్పటికప్పుడు అప్ డేట్‌గా దూసుకుపోతున్నారు.. మీ రాతల నుంచి ప్రేరణ పొంది ‘చౌరాస్తా’లో నిలుచున్న నా వైపు ఒక్కసారి చూస్తారని ఆశిస్తూ…
– ఉప్పలంచి నరేందర్, డెస్క్ జర్నలిస్ట్
(జీతం సరిపోక ఆటో నడిపిన డెస్క్ జర్నలిస్టు)