mud bath : మడ్ బాత్
‘మట్టే కథా అని తీసిపారేయకండి.. అందులో ఎంతో మహిమ ఉంది.. మట్టి నమ్ముకున్న వాడు ఎప్పుడు చెడిపోడు.. రోజు పిల్లలను తప్పకుండా కొంతసేపు మట్టిలో ఆడుకోనివ్వండి..’ ఏంటీ ఈ మట్టి గోలా అంటారా.. మీరే చూడండి..
ఈ ఫొటో చూసి వీరెవరో ఒళ్లంతా బురత పూసుకుని ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నారా..! మీరలా అనుకుంటే.. పొరపడినట్టే.. వారంతా మృతిక స్నానానికి రెడీ అవుతున్నారు. మృతిక స్నానం అంటే.. ఒళ్లంతా మట్టిని పూసుకుని స్నానం చేయడం అన్నమాట..! ఈ తరం వారు చెప్పే మడ్ బాత్.. అయితే ఎంజాయ్మెంట్ అనుకుంటున్న ఈ మృతిక స్నానంతో ఎన్నో లాభాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది..
వ్యాధులు దూరం..
మట్టి స్నానంలో ఉపయోగించే పుట్టమన్ను, రేగడి మట్టిలో గానుగ, వేప, కలమంద, తక్కెల, ఆవుపేడ, గోమూత్రం, తేనె, రోజ్ వాటర్‌తో పాటు 40 రకాల వనమూలికలు కలుపుతారు. దీని ద్వారా చర్మ సౌందర్యం పెరిగి కాంతివంతంగా తయారవుతారు. దీర్ఘకాలిక చర్మ వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే చర్మ వ్యాధుల నుంచి కాపాడుకోవాలనుకునే వారు వనమూలికలతో కూడిన మట్టిని శరీరానికి రాసుకుని గంట పాటు ఎండలో నిలబడి స్నానం చేయాలి. అలాగే కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్ల మోకాళ్లపై వనమూలికలతో కూడిన మట్టి ప్యాక్‌లను వేసుకోవడం వల్ల క్రమక్రమంగా కీళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి.
పతాంజలి ఆధ్వర్యంలో…
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పతంజతి ఆధ్వర్యంలో ఈ మృతిక స్నానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగాంగానే నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠానాకలాన్ శివారులోని అలీసాగర్ రిజర్వాయర్ బోటింగ్ పాయింట్ వద్ద వారం రోజులుగా ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. మీరు చూస్తున్ ఈ ఫొటోలు అక్కడివే.. పతంజలి యోగ గురువు ప్రభాకర్ ఆధ్వర్యంలో చేపట్టిన మట్టి స్నానానికి స్థానికంగా మంచి స్పందన లభిస్తోంది.
పట్నంలో మడ్‌బాత్
ఇక హైదరాబాద్ వంటి నగరాల్లో ఇప్పటికే మడ్ బాత్ ఆస్పత్రులు కూడా ఉన్నాయి. వీటికి రోజురోజుకూ ఆధరణ పెరుగుతూనే ఉంది. కొందరు ఆరోగ్య రక్షణ కోసం (మడ్ ట్రీట్మెంట్) మట్టి స్నానం కోసం వెళ్తుంటే.. మరికొందరు ఈ వేసవి ఉపశమనం పొందేందుకు మడ్ బాత్ వైపు మొగ్గు చూపుతున్నారు.
అమ్మ కోసం అన్ని వదిలేసి వచ్చా..