bigg boss : నాగార్జున రికార్డు రెమ్యునరేషన్
ప్రతి సారి బిగ్ బాస్ షోల మీద ఎన్నో రకాల వార్తలు వస్తూనే ఉంటాయి. ఇక ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్-5 స్టార్ట్ అయి మూడు రోజులు కూడా గడవక ముందే నానా హంగామా సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో అయితే ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సీజన్ కు కూడా టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ షోకు ఆయన వస్తూనే అంచనాలు విపరీతంగా పెంచేశాడు. బిగ్ బాస్ సీజన్-5 సందర్భంగాఆయన హోస్టింగ్ తో హౌస్ లోకి ప్రేక్షకుల మైండ్ రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేసి సక్సెస్ అయ్యారనేచెప్పాలి.( bigg boss)
ఇక హౌస్లోకి ఒకేసారి 19 మంది కంటెస్టెంట్లు కూడా వచ్చారు. అయితే అప్పటి నుంచి నాగార్జున అసలు ఈ షోకు ఎంత రెమ్యున రేషన్ తీసుకుంటున్నారో అంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. కాగా ఆయన ఈ సీజన్ మొత్తానికి కండ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ సీజన్ మొత్తానికి కలిపి రూ.12కోట్లు తీసుకుంటున్నారంట. ఇక గత సీజన్-4కి ఆయన రూ.8కోట్లు తీసుకున్నారంట. అంతే కాదు అంతకుముందు చేసిన సీజన్-3కి ఒక్క ఎపిసోడ్కు రూ.12లక్షలు తీసుకున్నారంట. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. మరి రాబోయే సీజన్లకు ఆయన ఇంకెంత తీసుకుంటారో అని అంతా అనుకుంటున్నారు.