Nandamuri Balakrishna :‘చూడు ఒక వైపే చూడు.. రెండో వైపు చూడాలను కోకు.. మాడిపోతావ్’ అనే పదునైన డైలాగ్స్ చెప్పే నందమూరి బాలకృష్ణ మనసెరుడు ఎవరి తరం కాదు. అవునూ నిజమే అభిమానులైనా సరే హద్దుల్లో ఉండాలి అనే ఆయన తత్వం ఎవరికీ అర్థం కాదు. బాలయ్య తీరుపై సమాజం ఎన్ని కుల్లు జోకులు వేసినా ఆయన తన హుందాతనాన్ని ఎప్పుడూ పోగొట్టుకోలేదు.. సరికదా దానిని మరింత పెంచుకుంటూ ముందుకు సాగుతూనే ఉన్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ బాలయ్య ఫొటోలతో ఎన్నో జోకులు చక్కర్లు కొట్టినా ఎన్నడూ విమర్శలకు దిగలేదు. ఆ టైంలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు సాయంగా విరాళం అందించారు. తాజాగా హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలకు జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. భాగ్యనరగం వరదల్లో కొట్టుమిట్టాడుతుంటే కొందరు వెకిలి చేష్టలతో వరద వీడియోలతో జోకులు క్రియేట్ చేస్తున్నారు. మరికొందరు హీరోలు ట్విట్టర్లలో కుల్లు జోకులు పోస్టు చేస్తున్నరు. కానీ మన (Nandamuri Balakrishna ) నందమూరి నట సింహం జనం కష్టాలను చూసి చలించిపోయారు. వరద బాధితులను ఆదుకునేందుకు తనవంతు సాయంగా రూ.1.50 కోట్లు విరాళంగా అందించారు. ఆయన చేసిన ఈ పనికి ‘బాలయ్య నువ్వు సూపరయ్యా’ అంటూ అభిమానులు అభినందిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో సినీ కార్మికులకు కూడా బాలయ్య సాయం అందించారు.