
- ఎన్పీఎల్ జోనల్ స్పోర్ట్స్ మీట్లో ప్రభత
జనగామ, మన చౌరాస్తా : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని నారాయణ పాఠశాలలో ఘనంగా వరంగల్ జోనల్ స్థాయిలో నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు కాజీపేట బ్రాంచి లో నిర్వహించారు. ఈ పోటీల్లో జనగామకు చెందిన నారాయణ స్కూల్ విద్యార్థులు సత్తాచాటి పలు ట్రోపీలు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జోనల్ డీజీఎం రిజ్వానాఇమ్రాన్, హన్మకొండ ఎంఈవో నెహ్రూ నాయక్, ఏసీపీ ప్రశాంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. క్రీడలు కేవలం శారీరక బలాన్ని మాత్రమే కాకుండా, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, సమయస్ఫూర్తిని కూడా నేర్పుతాయని అన్నారు. క్రీడలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయన్నారు. గెలిచినా, ఓడినా అందరూ క్రీడా స్ఫూర్తితో ప్రదర్శించాలని అన్నారు. అనంతరం విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. జనగామ నారాయణ స్కూల్ విద్యార్థులు జూనియర్ గర్ల్స్, బాయ్స్ స్థాయిలో కొక్కో, కబడ్డీలో మొదటి బహుమతి సాధించారు.. సీనియర్ గర్ల్స్ లో త్రోబల్, కబడ్డీలో రెండో స్థానం, కొక్కో లో మొదటి స్థానంలో అదే విదంగా చెస్, క్యారమ్స్ లో మొదటి స్థానం, జూనియర్ రన్నింగ్లో మొదటి స్థానం సాధించారు. వీరికి ముఖ్యఅతిథులు ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో నారాయణ పాఠశాలల ప్రిన్సిపాల్ ఫర్హాన, జోనల్ కోఆర్డినేటర్లు ఆకుల సాయికృష్ణ, శ్యామల, శిరీష, అకడమిక్ డీన్లు విక్రమ్, సాఫ్ట్ స్కిల్ ఉపాధ్యాయులు వీణాకుమారి, ఏవో ఎండీ అన్వర్, పీఈటీ మహేష్, ఉపాధ్యాయులు అఖిల్, శేఖర్, అశోక్, రజిని, అనిత, నిఖిత తదితరులు పాల్గొన్నారు.




