Narthanasala first look poster
బాలయ్య ‘నర్తనశాల’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఈరోజు విడుదల చేశారు. బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో సౌందర్య, శరత్‌బాబు, శ్రీహరి కీలక పాత్రల్లో 2004లో ఎన్నో అంచనాలతో ఈ సినిమా మొదలైంది. అదే సంవత్సరం ఏప్రిల్ 17న సౌందర్య హెలీకాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో ఈ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. ఎప్పటికైనా ఈ చిత్రాన్ని పూర్తి చేస్తానని అప్పట్లో చెప్పిన బాలయ్య తర్వాత వదిలేశారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సంబంధించిన 17 నిమిషాల వీడియో(షార్ట్ ఫిలిమ్‌గా)ను ఈ దసరాకు విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. బాలయ్య తీసుకున్న ఈ నిర్ణయంతో ఇన్నేళ్ల తర్వాత తెరపై సహజ నటి సౌందర్యను మళ్లీ చూడబోతున్నామని ఆమె అభిమానులు అంటున్నారు.