ఏడు నెలల గర్భవతిగా ఉన్న భార్యను వదిలేసి..
అందరు ఎదరు చూస్తున్న సమయం వచ్చేసింది. గ్రాండ్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఆదివారం అంగరంగ వైభవంగా మొదలైంది. ఇక ఈ సారి కూడా కింగ్ నాగార్జున హోస్టింగ్ చేయగా 19మంది కంటెస్టెంట్లు ఒకేసారి హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. అయితే ఇందులో నటరాజన్ చెప్పిన మాటలు చాలామందిని ఎమోషన్‌కు గురి చేస్తున్నాయి. గత కృష్ణా జిల్లాకు చెందిన ఆయన ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా మంచి పేరే తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఏడునెలల గర్భవతిగా ఉందని, ఆమెను వదిలి రావవడం చాలా బాధగా ఉందంటూ కన్నీరు పెట్టుకున్నారు.
కాగా నటరాజ్ మాస్టర్ మొదట జెమిని టీవీలో వచ్చే డాన్స్ బేబీ డాన్స్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ టీవీ డాన్స్ షోలో కూడా సందడి చేశారు. వీధి సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టాడు నటరాజ్. ఇక ఆ తర్వాత కూడా హైవే, సై, చక్రం లాంటి మూవీలకు కొరియోగ్రాఫర్‌గా చేశారు. 2008లో ఈఆట సీజన్ 2 టైటిల్ విన్నర్‌గా నిలిచి స్టార్ అయిపోయాడు. అయితే 2009 లో నటరాజ్ నీతూ అనే తన ఆట సీజన్ 2 కంటెస్టెంట్ గా చేసిన అమ్మాయినే ఏడు సంవత్సరాలుగా ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. ఆమె పేరు నీతు. ఇక తన భార్య నీతూతో నటరాజ్ మాస్టర్ ఎన్నో టీవీ షోలు, ఆడియో ఫంక్షన్లకు కూడా వచ్చేవాడు. ఇక ఇప్పనుడు బిగ్ బాస్ హౌజ్‌లో సందడి చేయబోతున్నాడు.