
భీమదేవరపల్లి, మన చౌరాస్తా : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూర్ గ్రామానికి చెందిన నేతాజీ అసోసియేషన్ గత మూప్పై ఏళ్లుగా వివిధ భక్తి కార్యక్రమాలు చేస్తూ ఆదర్శవంతంగా నిలుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం గౌరవ అధ్యక్షుడు కొదురుపాక శ్రీనువాస్ నేతృత్వంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగా గ్రామ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ సంస్కృతి సంప్రదాయలను కాపాడుకుంటూ వస్తున్నామని తెలిపారు. అనంతరం అధ్యక్షుడిగా జి.రాజన్న, సభ్యులుగా రాజేష్, అజయ్, కనకయ్య, శరత్, రాజు, పూర్ణచందర్, సురేష్, వినోద్‌కుమార్, సదానందంను ఎన్నుకున్నారు.