హైదరాబాద్, చౌరాస్తా :దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 322 కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందినట్టు కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ తాజా గణాంకాలు వెల్లడించాయి. కొత్త కేసులతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,742కు చేరింది. కేరళలో అత్యధికంగా 128 కేసులు, కర్ణాటకలో 96, మహారాష్ట్రలో 35 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో డిల్లీలో 16 కొత్త కేసులు నమోదయ్యాయి.