
- ఇద్దరి చిన్నారులకు తప్పిన పెను ప్రమాదం
భీమదేవరపల్లి, మన చౌరాస్తా : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రాంనగర్ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాంనగర్ గ్రామానికి చెందిన బసిరెడ్డి శ్రీను (46) అనే లారీడ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. రాంనగర్ గ్రామానికి చెందిన శ్రీను తన మనవడు రిషి, రక్షిత రక్షిత్లను తీసుకొని ఆదివారం సెలవు దినం కావడంతో కటింగ్ కోసమని ముల్కనూర్ వైపు తన ద్విచక్ర వాహనంతో బయలుదేరాడు. ఎల్కతుర్తి నుంచి హుస్నాబాద్ వైపు వస్తున్న మట్టి టిప్పర్ అతివేగంతో వచ్చి ద్విచక్ర వాహనం ఢీకొనడంతో నడుపుతున్న శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనంపై ఉన్న రిషి, రిక్షితులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ రెండు నెలల్లో మట్టి తిప్పర్ డ్రైవర్ల అజాగ్రత్త అతివేగం వల్ల రాంనగర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మట్టి టిప్పర్లను ఆపివేసి ఆందోళన చేపట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని చేస్తున్నారు.





