
- రూ. 24 లక్షల విలువైన 449 బంగారంతో తయారీ
పాలకుర్తి, మన చౌరాస్తా : స్వయంభు శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి వారికి ఓ అజ్ఞాత భక్తుడు బంగారు నాగాభరణం సమర్పించినట్లు ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు తెలిపారు. సోమవారం అజ్ఞాత భక్తులు సోమేశ్వర స్వామి దర్శించుకొని రూ. 24 లక్షల విలువైన 449 గ్రాముల బంగారు నాగాభరణం స్వామివారి ప్రాణ మట్టంపై అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం ఆలయ మహా మండపంలో ఆలయ ఈవో సల్వాది మోహన్ కు అందజేశారు. భక్తుడిని ఈవో, అర్చకులు స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించారు.