
పాలకుర్తి, మన చౌరాస్తా : పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభువు శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి భక్తుడు వెండితో తయారుచేసిన 8 రకాల హారతులను సమర్పించినట్లు ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు మంగళవారం తెలిపారు. ఆలయ అర్చకుడు దేవగిరి లక్ష్మన్న సూచనల మేరకు స్వామివారి పూజా కార్యక్రమాల్లో హారతులు ఇచ్చేందుకు నల్లగొండ జిల్లాకు చెందిన భక్తుడు సోమ కార్తీక్-తేజశ్రీ దంపతులు రూ2,26,900 విలువైన 2 కేజీల 292 గ్రాముల మిశ్రమ వెండి తో తయారు చేసిన 8 హారతులను ఆలయానికి సమర్పించినట్లు వారు తెలిపారు.