
- కేసీఆర్ ఫాం హౌస్‌లో జారిపడిన రాజేశ్వర్ రెడ్డి
- కాలుకు గాయం
జనగామ, మన చౌరాస్తా : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం జనగామలో పలు కార్యక్రమాలకు హాజరైన పల్లా సాయంత్రం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఎర్రవల్లి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ జారి పడడంతో కాలుకు గాయం అయినట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను అంబులెన్స్‌లో హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. కాగా ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటే పల్లా రాజేశ్వర్‌రెడ్డి జారి పడడం ఏంటని కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)