
కొమురవెల్లి, మన చౌరాస్తా : మూడో విడత ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన సర్పంచులను వార్డు సభ్యులను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అభినందించారు. చేర్యాల, కొమురవెల్లి మండలాలకు సంబంధించిన సర్పంచులను శాలువాతో సత్కరించి కొనియాడారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఆనాటి కేసిఆర్ ప్రభుత్వం ప్రతి ఊర్లలో అభివృద్ధి చేసిందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




