మన చౌరాస్తా, బచ్చన్నపేట : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం వారి నిత్య నాట్య సంగీత కార్యక్రమం ఘనంగా జరిగింది. శుక్రవారం జరిగి ఈ కార్యక్రమంలోశ్రీచంద్ర కళా నిలయం గురువు పేరిణి సంతోష్ బచ్చన్నపేట చెందిన శిష్య బృందం పేరిణి, ఆంధ్ర నాట్య ప్రదర్శన ఇచ్చి స్వామివారికి నృత్య నిరాజనం పలికారు. కార్యక్రమంలో బచ్చన్నపేట విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.