
బచ్చనపేట, మన చౌరాస్తా : శ్రీచంద్రకళా నిలయం గురువులు పెరుమాళ్ల సంతోష్ పేరీని ఆధ్వర్యంలో శనివారం పేరిణి నాట్యం, ఆంధ్ర నాట్యం ఉప్పల్ మినీ శిల్పారామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ పద్మశ్రీ నవరాజ రామకృష్ణ నృత్య రీతులు అయినటువంటి పేరిణి, ఆంధ్ర నృత్య అంశాలు వారికి నృత్య నీరాంజనంగా వినియత గవ్య, బ్రహ్మగవ్య, తల్లానా, దశావతారాలు, దేవి శృతి, శబ్ద పల్లవి, మహాగణపతియే, రామదాసు కీర్తనలు పలు అంశాలు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమంలో జనగామ, బచ్చన్నపేట, ఆలేరు, స్టేషన్ఘన్పూర్కు చెందిన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)