పాలకుర్తి, మన చౌరాస్తా : మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో పాలకుర్తి ఫోటోగ్రాఫర్ల మీటింగ్ నిర్వహిచారు. ఈ సమావేశంలో మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా ఎడవెల్లి వెంకటేశ్వర్లు, అధ్యక్షుడిగా రాపోలు రాంబాబు, ఉపాధ్యక్షుడిగా గుడికందుల నరేష్, కార్యదర్శిగా గజ్జి రాజు, సహాయ కార్యదర్శిగా చిన్నబోయిన అశోక్, కోశాధికారిగా చిలుమల బాబు, కార్యవర్గ సభ్యులుగా రమణ సుధాకర్, పున్నతుల స్వామి, ఇల్లందుల అశోక్, ఎలిగెటి సోమన్న, కొత్తూరి మధును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్లు రాపోలు లక్ష్మణ్, పట్టురి శ్రీను, జీడి సంజయ్, బొమ్మగాని ప్రదీప్, వర్ధమాన్ శ్రీనివాస్, మహేష్, సంతోష్, మహేందర్, సురేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.