లింగాలఘణపురం, మానాచౌరాస్తా : మండలంలో ఏర్పాటు చేసిన సర్వాయి సర్దార్ పాపన్న విగ్రహాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి తోపాటు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కావ్యను మండల యూత్ జాయింట్ సెక్రెటరీ దామెర కుమార్ పూల బొకే ఇచ్చి ఆహ్వానించారు.