Ts Press Academy : ‘ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులే మిన్నా..’ అవును ఇది అక్షరాల నిజం. కష్టాల్లో ఉన్న వారికి సాయమందిస్తే.. వారు ఆ సాయాన్ని ఎప్పటికీ మర్చిపోరు. తెలంగాణ జర్నలిస్టు కూడా మీడియా అకాడమీని అలాగే గుర్తుపెట్టుకుంటారు. రాష్ట్రంలో కోవిడ్ బారిన పడిన దాదాపు వెయ్యి మంది జర్నలిస్టులకు అకాడమీ అందించిన సాయం మాటల్లో వర్ణించలేనిది. వారందించిన రూ.20 వేల సాయం ఆర్థికంగా చితికిపోయి బతుకెళ్లదీస్తోన్న ఎంతో మంది జర్నలిస్టులకు భరోసా ఇచ్చింది. పెద్ద పేపరు, చిన్న పేపరు, యూనియన్లు, అక్రిడేషన్కార్డులు వంటి సంబంధాలు లేకుండా చేయూతనందిస్తోన్న అకాడమీకి ‘చౌరస్తా’లో సలాం కొడుతున్నా.. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా..
అక్టోబర్ 5వ వరకు ఆర్థిక సాయానికి దరఖాస్తులు..
జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి మంజూరు చేసే ఆర్థిక సాయం కోసం అక్టోబర్ 5వరకు అర్హత గల జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ (Press Academy) చైర్మన్ అల్లం నారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2014 జూన్ 2 తర్వాత మరణించిన జర్నలిస్టులకు సంబంధించిన కుటుంబ సభ్యులు, జర్నలిస్టు వృత్తిలో ఉంటూ అనారోగ్యం బారిన పడి పనిచేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులు మాత్రమే ఈ ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో లబ్ధి పొందిన వారు, ఇప్పటికే మీడియా అకాడమీకి దరఖాస్తులు పంపిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. అర్హులైన వారు సంబంధిత పౌర సంబంధాల అధికారులైన ఉప సంచాలకులు, సహాయ సంచాలకులు, డీపీఆర్వోల ద్వారా ధ్రువీకరించిన దరఖాస్తులను మీడియా అకాడమీ కార్యాలయానికి పంపించాలని ఆయన కోరారు.
దరఖాస్తుల పంపాల్సిన చిరునామా..
కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, హైదరాబాద్ (ts press academy)
ఇంటి నం.10-2-1, సమాచార భవన్, 2వ అంతస్తు,
ఏసీ గార్డ్స్, మాసాబ్ ట్యాంక్,
తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్
ఫోన్ : 040 – 23298672, 23298674