జనగామ, మన చౌరాస్తా : జనగామ పట్టణంలోని ప్రెస్టెన్ పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 2005-06 బ్యాచ్ చెందిన ఎస్ఎస్సి విద్యార్థులు 18 సంవత్సరాల తర్వాత అదే స్కూల్లో కలుసుకున్నారు. పాఠశాల రోజులను గుర్తు చేసుకుని ఆనందంగా గడిపారు. ఒకరి బాగోగులను ఒకరు అడిగి తెలుసుకున్నారు. తమకు చదువు చెప్పిన గురువులను మెమొంటోలు, శాలువాలతో సత్కరించారు.