Ramgopal varma : నోములపై వర్మ ట్విట్
‘నాగార్జనసాగర్ బై పోల్‌లో తన ఓటు టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కే..’ అంటూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆసక్తికర ట్విట్ చేశారు. వర్మ.. ఏంటీ సాగర్ లో ఓటేయడం ఏంటీ.. అని అశ్చర్యపోకండి.. ట్విట్టర్.. అసలు ట్విస్ట్ ఇదండీ..
రాంగోపాల్ వర్మ (Ramgopal varma ) అంటేనే సంచనల వ్యాఖ్యలకు కేరాఫ్.. ఆయన ఏది మాట్లాడినా అది మీడియాకు హాట్ టాపిక్‌గా మారిపోతుంది. అయితే తాజా రాష్ట్రంలో జరుగుతున్న నాగార్జనసాగర్ బైపోల్‌పై వర్మ తన ట్విట్టర్లో రూలింగ్ పార్టీ నుంచి పోటీలో ఉన్న నోముల భగత్‌పై ఆసక్తిర పోస్టు పెట్టారు. అదేంటంటే..
‘ఇప్పటికే నేను సీఎం కేసీఆర్‌ను పులిలా.., మంత్రి కేటీఆర్‌ను ఓ సింహంలా.. చూశా.. కానీ చిరుతను వాకింగ్ తీసుకెళ్తున్న ‘నోముల భగత్’ వీడియో చూశాక ఇతడినే ఇష్టపడుతున్నట్లు పేర్కొన్నారు. తనకే గనుక సాగర్ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉంటే 17న జరిగే ఉప ఎన్నికల్లో భగత్‌కే ఓటు వేసేవాడిని..’ అంటూ ట్విట్టర్లో భగత్ చిరుతతో వాకింగ్ చేస్తున్న వీడియోను పోస్టు చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
VAAMMO we know #KCR and @KTRTRS are TIGER and LION but I love this candidate @BagathNomula who is taking a CHEETAH for a walk ..If I had a VOTE I will vote for this REAL HERO on 17th by-election of Nagarjuna Sagar pic.twitter.com/sYETa51Zq0
— Ram Gopal Varma (@RGVzoomin) April 2, 2021
అమ్మ కోసం అన్ని వదిలేసి వచ్చా..