లింగాలఘణపురం, మన చౌరాస్తా : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్‌ను లింగాలఘణపురం మండలానికి చెందిన నేతలు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి కీసర దిలీప్ రెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బత్తిని అశోక్ కుమార్, సీనియర్ నాయకులు దామెర నాగరాజు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నర్సింగ రమేష్, మండల యూత్ జాయింట్ సెక్రెటరీ నవీన్ కుమార్ తదితరులు కలిసి సాయికుమార్‌ను సన్మానించారు.