
Oplus_16908288
కోహీర్, మన చౌరాస్తా : ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఉప సర్పంచులను ఘనంగా సన్మానించారు. కోహీర్ మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్లో శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సజ్జపూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ పద్మమ్మ, ఉప సర్పంచ్ కొతిలి మైసయ్య (సురేష్)తో పాటు మండలంలో కాంగ్రెస్ తరపున గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చంద్రశేఖర్, ఎంపీ సురేష్ షెట్కార్ ఇతర నాయకులు పాల్గొన్నారు.





