స్టేషన్‌ఘన్‌పూర్, చౌరాస్తా : స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో చాగల్ గ్రామానికి చెందిన లొంక వెంకటయ్య (55) అనారోగ్యంతో మృతి చెందగా సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పోగుల సారంగపాణి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. వీరితో పాటు బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చేపూరి ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు సదరపల్లి సదానందం, జాబు శంకరయ్య, అమీర్, రజక సంఘం నాయకులు పొన్న రవీందర్, పొన్న యాకయ్య, మచ్చ యాదగిరి, యూత్ అధ్యక్షులు పొన్న రాజేష్ పాల్గొన్నారు.