
- టీపీసీసీ కార్యదర్శి కంచ రాములు
జనగామ రూరల్, మన చౌరాస్తా : మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీపీసీసీ కార్యదర్శి, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచ రాములు అన్నారు. ఆదివారం జనగామ మండలం ఓబుల్ కేశ్వాపూర్ లో నిర్వహించిన ‘శ్రీ రేణుక ఎల్లమ్ల ఫోక్ సాంగ్’ షూటింగ్ ను ఆయన కెమెరా స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కంచ రాములు మాట్లాడుతే నేటి యువత క్లబ్బులు, పబ్బుల పేరుతో యువత చెడు మార్గంలోకి వెళ్లకుండా మన తెలంగాణ సంస్కృతిలో ఉన్న కట్టు, బొట్టు, బోనం ఆచారాలను కాపాడే ఇలాంటి కార్యక్రమాల వైపు నడవాలన్నారు. వీటి వల్ల మన సంస్కృతి, సంప్రదాయాలను రాబోయే తరాలకు అందించిన వారమవుతామన్నారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ ముఖ్య సలహాదారుడు కూచన సుప్రీం, డైరెక్టర్ సందీప్ సామ్, కొరియోగ్రాఫర్ సన్నీ, కెమెరామెన్ మహేష్, హీరోయిన్ ఉమా రేచర్ల, సహాయ నటరాలు సస్విత, ఆలయ చైర్మన్ బడికె కృష్ణస్వామి, జనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బడికె ఇంద్ర, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు మంగ శంకర్, ప్రైమ్ 1 సీఈవో మారేడు వినయ్ కుమార్, జెరిపోతుల పరశురాములు, ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.