
జనగామ, మన చౌరాస్తా : ప్రతి ఊరిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యత, నాణ్యమైన విద్య, విద్యార్థుల నమోదు పెంచుటకు, విద్యా ప్రాముఖ్యతలను కళ్ళ కు కట్టినట్లు ‘చిన్నా కన్నా మీకు చదువేరా మిన్నా..’ అంటూ రవీందర్ అల్లూరి రాసిన బడి బాట ప్రేరణ పాటను సోమవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆవిష్కరించారు. ఈ పాటను రవీందర్, టీచర్లు వసంత, జ్యోతి, యువన గానం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్, డీఈవో భోజయ్య, రవీందర్, వసంత, జ్యోతి, బేబీ, యువన, ఓబుల్ కేశ్వాపూర్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు నర్సింహారెడ్డి, ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయుడు సురేందర్ రెడ్డి, లింగం పాల్గొన్నారు.