- జనగామ కలెక్టర్ శివలింగయ్య
జనగామ, (చౌరాస్తా ప్రతినిధి) : కొత్త ఓటర్ల నమోదును స్పీడప్ చేయాలని జనగామ కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. శాసన మండలి, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా తాయారీని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పర్మర్ పింకేశ్ కుమార్తో కలిసి పరిశీలించారు. ఈ మేరకు పట్టణంలోని గీతా నగర్లో ఉన్న ఏబీవీ ఉన్నత పాఠశాల, వడ్లకొండ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న కొత్త ఓట్ల నమోదు ప్రక్రియను చెక్ చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లకు సూచనలు చేశారు. ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. నకిలీ ఓటర్లను గుర్తించి జాబితా నుంచి తొలగించాలన్నారు. వారి వెంట జనగామ ఆర్డీవో మురళీకృష్ణ, తహసీల్దార్ వెంకన్న పాల్గొన్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)