
పాలకుర్తి, మన చౌరాస్తా: జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి శివారులోని రామాలయంలో సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని వేలాది మంది దంపతులు కళ్యాణం లో పాల్గొని పెళ్లి వేడుకను కనులారా వీక్షించారు. దక్షిణ అయోధ్యగా పిలవబడే వల్మిడిలో రాములోరి కళ్యాణాన్ని సాంప్రదాయ పద్ధతిలో అర్చకులు, పండితులు వేదమంత్రాలతో జరిపించారు.
పాలకుర్తి, బమ్మేర, గూడూరు గ్రామాల్లో ను శ్రీరామ నవమి పురస్కరించుకొని సీతారాముల స్వామి కళ్యాణ వేడుకలు నిర్వహించారు. వలిమిడిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. మాజీ మంత్రి దయాకర్ రావు స్వామి వార్లలను దర్శించుకున్నారు. 20,000 మందికి మహా అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా టెంట్ కూలడంతో పలువురు భక్తులకు గాయాలయ్యాయి. డిసిపి రాజమహేంద్ర నాయక్, ఈవో మోహన్ బాబు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి, సత్యనారాయణ, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.