
పాలకుర్తి, మన చౌరాస్తా : ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై స్కూల్ గ్రౌండ్ జనగామలో జిల్లా స్థాయి సీనియర్ పురుషులు, మహిళా సాఫ్ట్బాల్ సెలక్షన్స్ పోటీలు ఇటీవల జరిగాయి జరిగాయి. ఇందులో పాలకుర్తి మండలం నుండి బాలబోయిన సందీప్ (చెన్నూర్), చిట్యాల రఘు (పాలకుర్తి), కుమార్ (ఇరవెన్ను)కు చెందిన క్రీడాకారులు పాల్గొని ఎంపికయ్యారు. ఉత్తమ ప్రతిభ చూపడంతో వారు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 7, 8, 9న వరంగల్ జిల్లాలోని బొల్లికుంటలో వాగ్దేవి గ్రూప్ అఫ్ ఇనిస్ట్యూట్ లో 11వ రాష్ట్ర స్థాయి సీనియర్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్ లో పాల్గొననున్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను గ్రామస్తులు, సీనియర్ క్రీడాకారులు అభినందించారు.