- జిల్లా వ్యవసాయాధికారి వినోద్‌కుమార్
బచ్చన్నపేట, మన చౌరాస్తా : నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవయాధికారి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన బచ్చన్నపేటలో ఫెర్టిలైజర్ షాపులను తనిఖీ చేసి స్టాక్ రికార్డులు, బిల్ బుక్కులు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలతో పాటు పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. విత్తన డీలర్లకు విత్తనాలు పర్మిషన్ ఉన్న కంపెనీ నుంచి మాత్రమే తీసుకోవాలన్నారు. సీడ్ లైసెన్స్ కొనుగోలు దారులకు కనిపించే విధంగా పెట్టాలని, ధరల పట్టిక రైతులకు కనిపించే విధంగా ఉంచాలన్నారు. బ్లాక్ మార్కెటింగ్ చేయరాదన్నారు. అదే విధంగా నిషేధిత బీటీ-3 విత్తనాలు ఎవరైనా అమ్మితే వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలన్నారు. విత్తనాలు కొన్నప్పుడు తప్పనిసరి బిల్లు తీసుకోవాలని, విత్తనం లాట్ నెంబర్, ఎక్స్పరీ డేట్ వివరాలను బిల్లులో ఉండేలా చూసుకోవాలన్నారు. బిల్లుపై రైతు సంతకం, డీలర్ సంతకం తప్పనిసరిగా చేయాలన్నారు. పంట కాలం ముగిసే వరకు విత్తన పాకెట్, రసీదులు దాసి పెట్టాలన్నారు. అనుమతి లేని బీటీ పత్తి విత్తనాలు కొనుగోలు చేయకూడదని, బీటీ 01, బీటీ 2 మాత్రమే అనుమతి ఉన్నాయని తెలిపారు. బీటీ3 అని, గడ్డి మందు తట్టుకునే పత్తి విత్తనాలు అని వచ్చే దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. విత్తనం కొనేటప్పుడు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సలహాలు తీసుకొని స్థానిక పరిస్థితుల దిగుబడుల ఆధారంగా ఎన్నుకోవాలన్నారు.