
చేర్యాల, మన చౌరాస్తా : చేర్యాల మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు బుధవారం రోజున యూత్ ఫర్ సోషల్ ఇంఫాక్ట్ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.ప్రణీత ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ప్రణీత మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మార్పులు కనుగుణంగా విద్యార్థుల తమ యొక్క నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్నోవేషన్ పై కొత్త ఆలోచనలతో నూతన ఆవిష్కరణ దిశగా విద్యార్థులు ప్రయత్నించాలని, విద్యార్థులు నైతిక విలువలతో కూడుకున్న విద్యను అభ్యసించాలని, చెడు వ్యసనాల బారిన పడకుండా, భవిష్యత్తులో తమ లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో నలుగురు విద్యార్థులు ఒక గ్రూపులో ఏర్పడి ఒక ఆవిష్కరణ చేసే విధంగా ప్రణాళిక చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని వివిధ సమస్యలపై విద్యార్థుల అవగాహన పెంచుకొని వాటి పరిష్కారం మార్గాలు అన్వేషించాలని తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ విభాగం నుంచి డాక్టర్ ఎస్. గంగయ్య, సాంకేతిక విభాగం నుండి డి.నరేష్ కుమార్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.