
జనగామ, మన చౌరాస్తా : జనగామ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యంగ్ ఇండియా సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమం జనగామ జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో స్పెషల్ ఆఫీసర్ ఎండబట్ల శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ శిక్షణలో కరాటే, క్లాసికల్ డ్యాన్స్, గేమ్స్, స్పోకెన్ ఇంగ్లీష్ లలో సుమారు 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ సంతోష్ కుమార్, డ్యాన్స్ మాస్టర్ అక్షయ, ఉపాధ్యాయులు భాస్కర్, దస్తగిరి, సఫియా, సుశీల తదియరులు పాల్గొన్నారు.