Tatikonda Rajaiah : తాటికొండ మారాజా.. నీ బుర్రే.. బుర్ర
డాక్టర్ రాజయ్య.. తాటికొండ రాజయ్య.. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య.. (Tatikonda Rajaiah) ఈయన పేరును ఎలా విన్నా.. రూపం ఒక్కసారిగా కళ్లముందు కదలాడుతుంది.. రాజన్న ఏం చేసినా కొంత వెరైటీగానే చేస్తడు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్లో ఉన్నా ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిండు. అందరినీ ఆకట్టుకుండు. ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకుని కారెక్కడు. ఆయన దశ తిరిగింది. అనూహ్యంగా తెలంగాణ తొలి కేబినెట్లో డిప్యూటీ సీఎం అయ్యాడు. ఆలోచనలేకనో.. ఆవేశపడో ఆ పదవి కొద్ది రోజులే చేసి.. పొగొట్టుకున్నడు. ఇక ఆయాల్టి నుంచి ఇయాల్టి దాక.. పెద్ద సారు కంట్లె పడాలని ఎన్నో ఇకమతులు చేస్తుండు. అందులో భాగంగానే రాజన్న గిప్పు గీ కొత్త స్కీం పెట్టిండు.. గదేంది అనుకుంటున్నారా.. మీరే సూడండి..
ఇప్పుడు రాష్ట్ర మంతటా గులాబీ పార్టీలో సభ్యత్వాల జాతర నడుస్తుంది. పైసలు కట్టుకునేది నాయకులే అయినా.. కనీసం పేర్లయినా రాయలే కదా. అందుకే ఇదంతా. అయితే ఈ సభ్యత్వాలు చేయడానికి రాజయ్య సారు వెరైటీ ప్రొగ్రామే అందుకున్నడు. దీని పేరు సంక్షేమ (ఆరోగ్య) యాత్ర. గీ యాత్ర ఇయ్యాల్టి నుంచి(22.02.2021) వారం రోజుల పాటు కొనసాగుతది. దీనికి సంబంధించి సారు ఓ కరపత్రమే కొట్టించుండు. రాజయ్య హాస్పిటల్ నుంచి ఏమేం.. సౌలత్ లు కల్పిస్తడో.. ఏం జేస్తరో.. అన్ని ఇగురాలు రాసుకొచ్చిండు. దేనిదేనికి డిస్కౌంట్ ఇస్తరో రాసిండు. గీ పాంప్లెంట్ చూసిన జనం ఒకింత ఆశ్చర్యానికి గురవుతుంటే.. మిగతా ఎమ్మెల్యేలు.. మంత్రులంతా ముక్కున వేలేసుకుంటున్నరు. మనకెందుకు ఇసొంటి ఐడియా రాకపాయే అని.. చూడాలే మరి.. రాజయ్య సారు ప్లాన్ వర్కవుట్ అయితదో.. లేక పెద్ద సారు కంట్ల పడి మరేమైతదో..!
మైనర్ వివాహంపై హైకోర్టు సంచలన తీర్పు
ఫాదర్ అయ్యాక.. బూతులు తగ్గించా.. బన్నీ
ముద్దుగుమ్మలు.. దిష్టి బొమ్మలు